Thursday, 04 Mar, 4.40 am ఈనాడు

వరంగల్
జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలి

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రసాద్‌, చిత్రంలో అధికారులు అంజయ్య,

మల్లే్లెశ్వర్‌రావు, ఆశాలత, పురుషోత్తం, తదితరులు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: గ్రామీణ అభివృద్ధిలో జయశంకర్‌ జిల్లాను ఉన్నత స్థానంలో ఉంచే విధంగా అధికారులు పనిచేయాలని పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ ఆదేశించారు. కమిషనర్‌తో పాటు పంచాయతీ రాజ్‌ శాఖ ఉన్నతాధికారులు జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం పర్యటించారు. ఉపాధి పనులు, పల్లె ప్రకృతి వనాల పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో జిల్లాలోని ఎంపీడీవోలు, ఈజీఎస్‌ ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ..గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని, మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పల్లె ప్రగతిలో జిల్లా ముందుండే విధంగా కృషి చేయాలని, ఉపాధి పనులను సైతం అన్ని గ్రామాల్లో లక్ష్యం ప్రకారం చేపట్టాలన్నారు. కూలీలకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు నర్సరీలను ఏర్పాటు చేసి, మొక్కలు పెంచాలన్నారు. ఉపాధి పనులు జరిగే ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని, కూలీలకు తాగు నీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు కృష్ణమూర్తి, కార్తీక్‌, శివరాములు తదితరులు పాల్గొన్నారు.
గణపురం, న్యూస్‌టుడే: కరకపల్లిలో జరిగిన ఉపాధి హామీ పనులను కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కమిషనర్‌ ప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. పనులు ఏ మేరకు జరిగాయో కొలతలు వేయించారు. రికార్డులు పరిశీలించారు. శ్మశాన వాటిక, పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. వనం ఎప్పుడూ పచ్చగా ఉండేలా రోజూ నీళ్లు పట్టించాలని ఎంపీˆడీవో అరుంధతికి సూచించారు. అనంతరం నర్సరీని చూశారు. పల్లెప్రగతి పనుల్లో భాగంగా రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. ఆయన వెంట డీఆర్‌డీవో పురుషోత్తం, డీపీˆవో ఆశాలత, సర్పంచి పోట్ల నగేష్‌ తదితరులు ఉన్నారు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top