Tuesday, 28 Sep, 11.15 pm ఈనాడు

మార్కెట్‌
JLR I-PACE Black: ప్రారంభమైన జేఎల్‌ఆర్‌ ఐ-పేస్‌ బ్లాక్ బుకింగ్‌లు!

దిల్లీ : టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని వాహన తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) భారత్‌లో ఐ-పేస్‌ బ్లాక్‌ కారు బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ వేరియంట్‌తో పోలిస్తే బ్లాక్‌లో అదనపు ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. బ్లాక్‌ ప్యాక్‌తో పాటు పనోరమా రూఫ్‌ ఉన్నట్లు వెల్లడించింది. డోర్‌ మిర్రర్‌ క్యాప్స్‌ని, గ్రిల్‌, గ్రిల్‌ సరౌండింగ్స్‌, సైడ్‌ విండో సరౌండ్స్‌, రేర్‌ బ్యాడ్జెస్‌ని పూర్తిగా బ్లాక్‌ ఫినిష్‌తో కవర్‌ చేసినట్లు పేర్కొంది. దీంతో కారు మరింత ఆకర్షణీయంగా తయారైందని తెలిపింది.

భారత్‌లో సంస్థ నుంచి వచ్చిన తొలి విద్యుత్తు కారు ఐ-పేస్‌. దీన్ని గత మార్చిలో విడుదల చేశారు. 4.8 సెకన్లలో ఇది 100కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. దీంట్లో 90 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది 294 కేవీ శక్తిని, 696 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారులో 'సాఫ్ట్‌వేర్‌ ఓవర్‌ ది ఎయిర్‌(ఎస్‌ఓటీఏ)' వ్యవస్థను పొందుపరిచారు. దీంతో బ్యాటరీ మేనేజ్‌మెంట్‌, ఛార్జింగ్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థలను రిమోట్‌తో నియంత్రించవచ్చు. ఈ కారును కొనుగోలు చేస్తే ఐదేళ్ల సర్వీస్‌ ప్యాకేజీ, ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ ప్యాకేజీ, ఎనిమిదేళ్లు లేదా 1.6 లక్షల కి.మీ వరకు బ్యాటరీ గ్యారంటీ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top