Monday, 10 Aug, 4.15 am ఈనాడు

హైదరాబాద్
జూలో ఆకట్టుకుంటున్న తెల్ల జింకలు

చార్మినార్‌, న్యూస్‌టుడే: నగరంలోని నెహ్రూ జూపార్కు దశాబ్దాల నుంచి జింకల సంతతికి పుట్టినిల్లుగా ఉంటోంది. ఇక్కడి జింకలను రాష్ట్రంలోని వివిధ ఆడవుల్లో సైతం వదిలిపెట్టారు. ఇప్పటికీ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జూలో ఆరేడు రకాల జాతులు ఉన్నప్పటికీ అల్బినో బ్లాక్‌ బక్‌(తెల్ల కృష్ణజింకలు) ఆకట్టుకుంటున్నాయి. రెండేళ్ల క్రితం పంజాబ్‌ నుంచి ఒక జత(ఆడ, మగ)ను తెప్పించారు. వీటికి బదులుగా మూషిక జింకలను అక్కడికి పంపించారు. గత ఏడాది ఈ తెల్లజింకల జంట ఒక పిల్లకు జన్మనివ్వగా.. ఇటీవల మరొకటి జన్మించింది. జూలో ఇవి పరుగులు తీస్తూ ఆకట్టుకుంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top