Saturday, 14 Sep, 5.30 am ఈనాడు

మెదక్
కానిస్టేబుల్‌కు జరిమానా

రామాయంపేట: చట్టం అందరికీ వర్తిస్తుందని, తమ, పర బేధాలు లేవని నిరూపిస్తుంది ఈ ఘటన. రామాయంపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ రమేష్‌ ఇటీవల తన ద్విచక్ర వాహనాన్ని స్థానిక ఎస్‌బీఐ ముందు నో పార్కింగ్‌ స్థలంలో నిలిపి ఉంచారు. దానిపై పోలీసు అని రాసి ఉంది. అటుగా వచ్చిన ఎస్‌ఐ మహేందర్‌ వాహనాన్ని గుర్తించారు. నో పార్కింగ్‌ స్థలంలో నిలిపి ఉంచినందుకు కానిస్టేబుల్‌కు రూ.235 జరిమానా విధించడం గమనార్హం. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతులు కారని, వాహనాలను ఇష్టారీతిగా నిలిపి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని చెప్పారు. ట్రాఫిక్‌ నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top