Friday, 30 Oct, 3.50 am ఈనాడు

తమిళనాడు
కరోనా కేసుల తగ్గుదలతో ఊరట

రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 7,19,403

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొన్ని రోజులుగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు ఊరట కలుగుతోంది. గురువారం కొత్తగా 2,652 పాజిటివ్‌ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. చెన్నైలో మాత్రమే 9 మరణాలు ఉండటంతో నగరంలోని మొత్తం మృతుల సంఖ్య 3,626కి చేరింది. మరో 902 మంది డిశ్ఛార్జి కాగా... ఇంకా 7,628 మంది ఆస్పత్రులు, ఇళ్లల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల మేరకు... కొత్తగా నమోదైన కేసుల్లో జిల్లాలవారీగా అత్యధికంగా చెన్నైలో 756 ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కోయంబత్తూర్‌ (251), సేలం (170), చెంగల్పట్టు (148), తిరువళ్లూర్‌ (146), ఈరోడు (124), తిరుప్పూర్‌ (94), కాంచీపురం (89), తంజావూర్‌ (88), వేలూర్‌ (59), తూత్తుకుడి (57), మదురై (51), తిరుచ్చి (47), నామక్కల్‌ (46), తిరువారూర్‌ (45), విళుపురం (42), నీలగిరి (39), నాగపట్నం (37), కన్యాకుమారి (35), కడలూర్‌ (31), కరూర్‌ (28), కృష్ణగిరి (28), పుదుకోట్టై (28), తిరుపత్తూర్‌ (26), రాణిపేట (24), తేని (24), తిరువణ్ణామలై (22), ధర్మపురి (21), తిరునెల్వేలి (20), కళ్లకురిచ్చి (15), శివగంగై (15), విరుదునగర్‌ (13), రామనాథపురం (10), అరియలూర్‌ (9), తెన్కాశి (7), దిండుగల్‌ (5), పెరంబలూర్‌ (2) జిల్లాలు ఉన్నాయి.

పుదుచ్చేరిలో మరో 181 కేసులు

పుదుచ్చేరిలో 4,001 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అందులో 102 మందికి పాజిటివ్‌ కేసులు ఉన్నట్టు గురువారం నిర్ధారణయింది. ఇందులో పుదుచ్చేరిలో 121, కారైకాల్‌లో 8, యానాంలో 19, మాహేలో 33 మంది చొప్పున కేసులు ఉన్నాయి. పుదుచ్చేరిలోని మొత్తం కేసుల సంఖ్య 34,761కిి చేరింది. రోజు వ్యవధిలో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 592కి పెరిగింది. మరో 142 మంది డిశ్ఛార్జి కావడంతో కోలుకున్న వారి సంఖ్య 30,449కి చేరింది. ఇంకా 3,720 మంది చికిత్స పొందుతుండగా... అందులో 2,123 మంది హోం క్వారంటెయిన్‌లో, 1,597మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇప్పటివరకు 3,00,167 నమూనాలు పరీక్షించగా, 2,62,971 ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. 15 లక్షల జనాభా ఉన్న పుదుచ్చేరిలో ఇప్పటివరకు 20శాతానికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. కరోనా ప్రభావం మళ్లీ పెరిగితే ప్రైవేటు వైద్యకళాశాలలను ఉపయోగించుకోవాలని, అప్పటివరకు ఆ కళాశాలల అవసరంలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి, సంచాలకులు, ప్రైవేటు ఆస్పత్రుల యంత్రాంగంతో బుధవారం జరిగిన సమాలోచనలో స్పష్టం చేసినట్టు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారిని పరీక్షించడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య బృందం ఇప్పటికే కారైకాల్‌, మాహే, యానాం ప్రాంతాల్లో అధ్యయనం ముగించిందని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో నవంబరు 3లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top