Thursday, 29 Jul, 10.35 am ఈనాడు

తాజా వార్తలు
Kitty Spencers: 62 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన డయనా మేనకోడలు కిట్టి

రోమ్‌: ప్రిన్సెస్‌ డయానా మేనకోడలు కిట్టి స్పెన్సర్‌ (30) దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్యాషన్‌ వ్యాపారవేత్త, బిలియనీర్‌ మైఖేల్‌ లూయిస్‌ (62)ను వివాహం చేసుకున్నారు. ఇటలీలోని ఫ్రాస్కాటిలోని విల్లా అల్డోబ్రాండినిలో ఈ నెల 24న అత్యంత ఘనంగా వివాహం జరిగింది. 2018 నుంచి వీరి మధ్య పరిచయం ఉంది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో కిట్టి ధరించిన గౌన్లు ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాషన్‌ డిజైనర్‌ డోల్స్‌ అండ్‌ గబ్బానా రూపొందించిన తెలుపు రంగు ప్రత్యేక గౌనులో కిట్టి మెరిసిపోయారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top