Saturday, 28 Nov, 4.07 am ఈనాడు

జాతీయ- అంతర్జాతీయ వార్తలు
కోర్టు బయటే ఆర్థిక వివాదాల పరిష్కారం

ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదన

ఈనాడు, దిల్లీ: గుత్తేదారులు, నిర్మాణ సంస్థలతో నెలకొన్న ఆర్థిక వివాదాలను కోర్టు బయటే పరిష్కరించుకోవాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా-ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతిపాదించింది. ఇందుకు స్వతంత్ర నిపుణుల రాజీ సంఘం (కాన్సిలియేషన్‌ కమిటీ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ ఎక్స్పర్ట్స్‌-సీసీఐయీ)ను ఏర్పాటు చేయనుంది. ఇందులో న్యాయ, పౌరపాలన, ఆర్థిక/ప్రయివేటు రంగాలకు చెందిన ముగ్గురు విశ్రాంత అధికారులు నిపుణులుగా ఉండనున్నారు. మొత్తం రూ.70వేల కోట్ల వ్యవహారాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. వీటిపై గుత్తేదారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతోంది. దాంతో వివాదాలను పరిష్కరించి గరిష్ఠంగా నాలుగు వారాల్లోనే సొమ్ము చెల్లించడానికి రాజీ మార్గమే మేలన్న అభిప్రాయం ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top