Sunday, 09 Aug, 1.35 am ఈనాడు

తాజా వార్తలు
కొవిడ్‌-19 సమయంలోనూ22 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐ

నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌

దిల్లీ: కొవిడ్‌-19 విజృంభిస్తున్న సమయంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో దేశంలోకి 22 బిలియన్‌ డాలర్లు వచ్చాయని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. మనదేశ ఎఫ్‌డీఐ విధానం ఎంత సరళంగా ఉందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. 22 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలో దాదాపు 90 శాతం వరకు ఆటోమేటిక్‌ మార్గంలో వచ్చినవేనని చెప్పారు. 'ప్రపంచంలోని అత్యంత సరళవంతమైన ఎఫ్‌డీఐ విధానం భారత్‌దే. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడాన్ని మేం కొనసాగించాం. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ 22 బిలియన్‌ డాలర్లకు పైగా ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌లోకి తరలివచ్చాయ'ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఐఐ నిర్వహించిన ఓ సమావేశంలో అన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top