Tuesday, 08 Oct, 6.30 am ఈనాడు

మెదక్
లారీ బోల్తా.. వందకు పైగా జీవాలు మృతి

రామాయంపేట, న్యూస్‌టుడే: ముందు నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొని లారీ బోల్తాపడటంతో జీవాలు చనిపోయిన సంఘటన రామాయంపేట జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాలు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి ఓ లారీ సుమారు 200 గొర్రెలతో హైదరాబాద్‌ వెళుతోంది. అదే సమయంలో భైంసా నుంచి బొలెరో వాహనం పాత బ్యాటరీలతో హైదరాబాద్‌ వెళుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపైకి రాగానే బొలేరో వాహనం టైరు పేలి నిలిచిపోయింది. దీన్ని గమనించని లారీ డ్రైవరు వెనక నుంచి బొలేరో వాహనాన్ని ఢీకొనడంతో లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న జీవాల్లో వంద వరకు చనిపోయాయి. ఈ ఘటనలో బొలేరో వాహన డ్రైవరు షారుఖ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top