Sunday, 15 Sep, 3.30 am ఈనాడు

మెదక్
మా ఊరిలో మద్యం వద్దు

గ్రామస్థుల తీర్మానం

గజ్వేల్‌, న్యూస్‌టుడే: తమ గ్రామంలో మద్యం తాగడం, విక్రయించడం కొనసాగించమని గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామస్థులు శనివారం తీర్మానం చేశారు. రాయపోల్‌ మండలం బేగంపేట ఠాణా పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో 250 వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 1300 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో పది వరకు గొలుసు దుకాణాలు ఉన్నాయి. రోజూ పలువురు మద్యం తాగుతూ గొడవలకు కారణం అవుతుండటంతో గ్రామంలోని యువత, మహిళలు మందుకొచ్చి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపేయాలని కోరారు. ఈ మేరకు గ్రామస్థులందరూ సమావేశమై మద్యపానం నిషేధించాలని తీర్మానం చేశారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఈమేరకు ఏఎస్సై హుస్సేన్‌, గ్రామ సర్పంచి రజిత, మహిళా మండలి సీఏ సుజాత ఆధ్వర్యంలో గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. తీర్మాన ప్రతిని పోలీసులకు అందజేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top