Saturday, 28 Nov, 4.07 am ఈనాడు

జాతీయ- అంతర్జాతీయ వార్తలు
మార్చి వరకు అన్నయోజన పొడిగింపు!

ఈనాడు, దిల్లీ: కరోనా కారణంగా పేదలకు ఉచితంగా తిండి గింజలు, పప్పులు ఇచ్చే పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని మార్చి వరకు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తగినంతగా బియ్యం, గోధుమలు, పప్పుల నిల్వలు ఉండడంతో ఈ పథకాన్ని పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకం కింద గత ఎనిమిది నెలలుగా ప్రతి నెలా 5 కిలోల బియ్యం/గోధుమలు, ఒక కిలో పప్పులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. నెలవారీ కోటాకు ఇవి అదనంగా ఇస్తోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top