క్రైమ్
మధ్యప్రదేశ్‌లో రేషన్ బియ్యం పక్కదారి
తెలంగాణకు అక్రమంగా తరలించినట్లు అంచనా
ఈనాడు, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన బియ్యం కుంభకోణం తెలంగాణలో కలకలం రేపుతోంది. కరోనా నేపథ్యంలో గత ఏప్రిల్ నుంచి నవంబరు వరకు కేంద్రం రేషన్‌కార్డుదారులకు నెలవారీ ఇచ్చే బియ్యాన్ని మరో 100 శాతం పెంచింది. ఇది అక్కడి అక్రమార్కులకు కలిసొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు పక్కదారి పట్టించారు. అవి తెలంగాణకు తరలినట్లు అక్కడి దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇండోర్‌లోని పలు రేషన్ దుకాణాల్లో కార్డుదారులకు ఇవ్వకుండా డీలర్లు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులకు ఫిర్యాదులు రావడంతో భారీ కుంభకోణం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆ బియ్యం వెళ్లినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి లావు ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తుంది. మధ్యప్రదేశ్ బియ్యం కూడా లావు రకమే కావటమే ఉత్తర తెలంగాణకు చెందిన కొందరు మిల్లర్లు కొనుగోలు చేసి సీఎమ్మార్ కింద ఇచ్చారా? అన్న అనుమానాలు వ్యాపారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అక్కడి బియ్యం ఇక్కడికి వచ్చినట్లు తమకు సమాచారం లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం 'ఈనాడు'తో చెప్పారు.
బియ్యం కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించింది. ఇందులో భాగంగా కుంభకోణానికి సూత్రధారులుగా భావిస్తున్న పలువురి ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. బియ్యాన్ని కొనుగోలు చేసిన వారిని గుర్తించేందుకు తెలంగాణకు రావాల్సి వస్తుందని ఇండోర్ పోలీసు అధికారి ఒకరు శుక్రవారం 'ఈనాడు'తో చెప్పారు.
related stories
-
హెరాల్డ్ కార్డ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రెండున్నర కిలోల బంగారం...
-
తాజా వార్తలు గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట...మళ్లీ ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్!?
-
శ్రీకాకుళం ఎప్పుడొస్తుందో బండి..!