ఈనాడు

3.2M Followers

మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్టు

09 Feb 2021.2:30 PM

హైదరాబాద్‌: మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 40 పాస్‌పోర్టులు, రూ.6వేలు స్వాధీనం చేసుకున్నారు. ముఠా అరెస్టుపై రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 'మలక్‌పేట్‌లోని గూడ్స్‌ అండ్ ట్రావెల్స్‌ సంస్థలో తనిఖీలు చేశాం. ఒమన్‌, మస్కట్‌కు మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నాం. ఉపాధి పేరిట మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించాం. విదేశాల్లో్ మహిళలను వేధిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముఠాలో ఉన్న నలుగురిని అరెస్టు చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

విదేశాల్లో మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఈ ముఠా వారిని వ్యభిచారంలోకి దించుతోంది' అని సీపీ వివరించారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: షర్మిల

తెరాసకు ప్రత్యామ్నాయం లేదు: గంగుల

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Eenadu