తాజా వార్తలు
మైఖెల్ జాక్సన్ స్టెప్పులేస్తున్న ట్రాఫిక్ పోలీస్..

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వైవిధ్యంగా విధులు నిర్వహిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ అధికారి తన విధుల్లో భాగంగా ప్రయాణికుల ముఖంలో నవ్వులు పూయిస్తున్నారు. ఇండోర్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజీత్ సింగ్ తన విధి నిర్వహణలో భాగంగా పాప్ రారాజు మైఖెల్ జాక్సన్ ఫేమస్ డ్యాన్స్ స్టెప్పు 'మూన్‌వాక్'చేస్తూ.. రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. దీంతో ఈ వీడియోకు తెగ లైకులు వస్తున్నాయి. ఒక్కసారిగా ఆ కానిస్టేబుల్ స్థానికంగా సెలబ్రిటీ అయిపోయాడు. ఆయనతో స్వీయచిత్రాలు దిగేందుకు సైతం స్థానికులు పోటీపడుతున్నారు.
ఇంతలా ఫేమస్ అయిన రంజీత్ సింగ్.. తన ప్రదర్శనతో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ఓ విషాధ సంఘటన ఉందని చెబుతున్నాడు. 'విద్యార్థి దశ నుంచి నాకు డ్యాన్స్‌పై మక్కువ. గొప్ప డ్యాన్సర్‌ను కావాలనుకున్నా. కానీ ఆర్థిక సమస్యల వల్ల కుదరలేదు. 16 ఏళ్ల క్రితం ఒక రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజలు గుమిగూడారు. అక్కడ ట్రాఫిక్‌ను నియంత్రించాలని నాపై అధికారి నుంచి సందేశం వచ్చింది. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి నా స్నేహితుడు.. ఆ సమయంలో నేను భయంతో రోడ్డుపై అడ్డంగా నృత్యరూపకంగా నడుచుకుంటూ వెళ్లాను. అయితే అక్కడ గుమిగూడిన ప్రజలు నన్ను చూస్తున్నారని ఉన్నతాధికారి చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఈ విధంగా డ్యాన్స్ స్టెప్పులతో.. ప్రయాణికులను నవ్విస్తున్నాను' అని సింగ్ చెప్పుకొచ్చారు. రోడ్డుపై డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న రంజీత్ సింగ్ కొన్ని టీవీ షోలలో కూడా పాల్గొన్నాడు. ఆయన ప్రతిభకు ఉత్తమ ట్రాఫిక్ కంట్రోల్ పోలీసు అవార్డు సైతం వచ్చింది. రోడ్డుపై ఎటువంటి గొడవలు జరగకుండా చూస్తారని ఏసీపీ ప్రశాంత్ చోబే సింగ్‌ను ప్రశంసించారు.
ఇవీ చదవండి..
related stories
-
ప్రధాన వార్తలు గ్యాంగ్ రేప్ వీడియో: ముగ్గురి అరెస్ట్
-
హెరాల్డ్ కార్డ్స్ సరిగ్గా నెల రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ ఇస్తానని చెప్పి ఇద్దరు వృద్ధులకు...
-
తాజావార్తలు తన కుక్కల్ని వైట్‌హౌజ్ నుంచి పంపించేసిన బైడెన్