Tuesday, 21 Jan, 12.30 am ఈనాడు

తాజా వార్తలు
మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు చంద్రబాబు

అమరావతి: రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం బయలుదేరిన తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో తిప్పితిప్పి అనంతరం మంగళగిరి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని తెదేపా ఎమ్మెల్యేలు మంగళగిరిలో అడ్డుకున్నారు. రహదారిపై బైఠాయించి నాయకులు ఆందోళన చేపట్టారు. డొంక రోడ్డులో వాహనాన్ని తిప్పడంపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, తెదేపా నేతలకు వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు బస్సు దిగి మంగళగిరి వీధుల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో నారా లోకేశ్‌, తెదేపా ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దీంతో పోలీసులు చంద్రబాబును, తెదేపా నేతలందరిని మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం చంద్రబాబు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌ నుంచి సొంతకాన్వాయ్‌లో తన నివాసానికి వెళ్లారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top