Thursday, 29 Jul, 6.20 am ఈనాడు

తూర్పు గోదావరి
మన్యంలో అప్రమత్తం

మోతుగూడెం, న్యూస్‌టుడే: మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాల నేపథ్యంలో చింతూరు డివిజన్‌ ఏఎస్పీ కృష్ణకాంత్‌ ఆదేశాల మేరకు మోతుగూడెం, డొంకరాయి పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు. మోతుగూడెం, డొంకరాయి ఎస్సైలు సత్తిబాబు, వెంకటేశ్వరరావులు ప్రధాన కూడళ్లలో సీఆర్పీఎఫ్‌ బలగాలతో వాహన తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం వైపు వచ్చే వాహనాలు, అనుమానాస్పదంగా సంచరించే వారిని విచారించి పంపుతున్నారు.

ఆర్టీసీ రాత్రి సర్వీసులు రద్దు: మావోయిస్టు అమరుల వారోత్సవాల నేపథ్యంలో బుధవారం నుంచి ఆగస్టు 3 వరకు రాత్రి పూట నడిచే విశాఖ-భద్రాచలం, భద్రాచలం-విశాఖ నాలుగు సర్వీసులను రద్దు చేసినట్లు విశాఖ ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top