ఈనాడు

3.3M Followers

మేకల కాపరి @ డాక్టరేట్‌

29 Oct 2021.07:30 AM

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

' వి జయమెప్పుడు గెలుపోటములను ఆశించకుండా ప్రయత్నించే వారినే వరిస్తుంది' అనే హరివంశరాయ్‌ బచ్చన్‌ సందేశం లింగంపేట మండలం శెట్పల్లికి చెందిన అట్టెం దత్తయ్యకు సరిగ్గా సరిపోతుంది.

చిన్నతనంలో మేకలు కాసిన ఆయన విశ్వవిద్యాలయం మెట్లెక్కడమే కాదు.. డాక్టరేట్‌ సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. ప్రస్తుతం ఏవీ కళాశాలలో అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

చదువుపై తరగని మమకారం

చదువుపై మమకారంతో ఒకవైపు మేకలు కాస్తూనే చిన్నచిన్న కథల పుస్తకాలు చదివేవారు. వేమన, సుమతి శతకాలు నేర్చుకున్నారు. బ్రహ్మంగారు, వెంకటదాసు కీర్తనలు కంఠస్థం చేశారు.

అనువైన వాతావరణం లేక..

పటేల్‌ నివాసంలో చదువుకునేవారు. పదిలో అత్యుత్తమ మార్పులు సాధించి ఇంటర్‌ పరీక్షలు రాశారు. అందులోనూ సత్తా చాటారు. నాడు మండల వ్యాప్తంగా 130 మంది ఇంటర్‌ పరీక్షలు రాయగా.. 12 మందే ఉత్తీర్ణత సాధించారు. అందులో ఆయన ఒకరు. ఇది గమనించి తండ్రి చదువుకోమని తన వంతు సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. అలా కామారెడ్డి ఓరియంటల్‌ కళాశాలలో బీవోఎల్‌ కోర్సులో ప్రవేశం పొందారు. ఉదయం వేళల్లో ప్రైవేటు పాఠశాల్లో బోధిస్తూ సాయంత్రం కళాశాలకు వెళ్లేవారు. తర్వాత నిజామాబాద్‌లో తెలుగు పండిట్‌ కోర్సు(టీపీటీ) పూర్తిచేసి ఉస్మానియా వర్సిటీలో ఎంఏ(తెలుగు)లో సీటు పొందారు. ప్రొఫెసర్‌ కమలాకర్‌శర్మ ప్రోత్సాహంతో యూజీసీ నెట్‌, ఏపీ సెట్‌ సాధించి ఎంఫిల్‌ పూర్తి చేశారు. 'మహా భారతంలో- సంవాదాలు సమగ్ర పరిశీలన' అంశంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ అందుకున్నారు.

రచనలు..పుస్తకాలు

భాష మీద పట్టు, ఆచార్యుల సహకారంతో ఆయన అనేక సాహిత్య వ్యాసాలు రాశారు. ఇప్పటి వరకు వివిధ పత్రికల్లో 80కి పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కల్లం(సాహిత్య వ్యాస రాశి), తెలంగాణ బీసీవాద సాహిత్యం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. రెండో పుస్తకాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు విద్యార్థులకు రిఫరెన్స్‌ బుక్‌గా ఎంపిక చేశారు.

ఎనిమిదేళ్లు అదే పని

ట్టెం లక్ష్మి- మల్లయ్య దంపతుల రెండో కుమారుడు దత్తయ్య. ఏడో తరగతి వరకు శెట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోనే చదివారు. ఉన్నత చదువులకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మేకల కాపరిగా మారారు. ఎనిమిదేళ్లు అదే పనిచేశారు. జీవాలు మేపేందుకు కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలకు వెళ్లేవారు. ఆయా సమయాల్లో అటవీ అధికారుల దెబ్బలు, నక్సలైట్ల బెదిరింపులు భరించారు.

మలుపు తిరిగిందిలా

గో చి గొంగడితో ఒకరోజు సాయంత్రం మేకల దగ్గరి నుంచి ఇంటికి వెళ్తున్న దత్తును డిగ్రీ చదువుతున్న బాల్యస్నేహితుడు ఇఫ్తేకార్‌ చూసి పిలిచారు. పాఠశాలలో చురుకుదనాన్ని గుర్తుచేసి ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాయమని సలహా ఇచ్చారు. అలా మళ్లీ చదువు వైపు మళ్లారు. లింగంపేటకు చెందిన ఉపాధ్యాయుడు రత్నాకర్‌ను సహకారం కోరడంతో ఆయన సమ్మతించి రాత్రివేళల్లో గ్రామానికొచ్చి పాఠాలు బోధించారు.

Advertisement

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Eenadu

#Hashtags