Friday, 18 Oct, 11.30 pm ఈనాడు

తాజా వార్తలు
మేం భారత్‌లా భారీ స్కోర్లు చేయాలి: డుప్లెసిస్‌

రాంచీ: పరువు నిలబెట్టుకోవాలంటే చివరి టెస్టులో భారత్‌లాగా భారీ స్కోర్లు చేయాలని దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కాబట్టి కాడి వదిలేయొద్దని వెల్లడించాడు. 'ఉపఖండంలో మరో వారం రోజులు మాత్రమే ఉండి దక్షిణాఫ్రికా విమానం ఎక్కేస్తామని కుర్రాళ్లు అనుకోవద్దు. ఇప్పుడు మనం ఆడుతున్న టెస్టు సిరీస్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగం. ప్రతి మ్యాచుకు మనం పాయింట్లు సాధించొచ్చు. అందుకే నా వరకు మానసికంగానే అసలైన సవాలు' అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.

'ఇప్పుడు మేమంతా చేయాల్సింది 50, 60లను శతకాలుగా మలవడం. ఆటగాళ్లతో పోలిస్తే కెప్టెన్‌గా నేనూ భిన్నమేమీ కాదు. చివరిసారి ఇక్కడికి మేం అనుభవజ్ఞులతో కూడిన పటిష్ఠ జట్టుతో వచ్చాం. అయినా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాం. అందుకే ఒడుదొడుకుల గురించి అతిగా ఆలోచించొద్దు. మెరుగయ్యేందుకే ప్రయత్నించాలి.

చివరి రెండు ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆ మ్యాచుల్లో మేం 20 వికెట్లు తీయలేదు. అంటే బౌలింగ్‌ పరంగానూ మెరుగవ్వాల్సి ఉంది' అని డుప్లెసిస్‌ అన్నాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top