తాజా వార్తలు
మీ సమష్టి కృషికి అభినందనలు: మోదీ

జైడస్ సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని ట్వీట్
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌లో కొవిడ్-19 టీకా అభివృద్ధిని సమీక్షించిన ప్రధాని మోదీ..ఈ ప్రయోగంలో పాల్గొన్న సిబ్బంది సమష్టి కృషిని ప్రశంసించారు. 'జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తోన్న స్వదేశీ డీఎన్ఏ ఆధారిత టీకా గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించాను. ఈ ప్రయత్నం వెనక ఉన్న సిబ్బంది సమష్టి కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ కీలక ప్రయాణంలో భారత ప్రభుత్వం వారితో చురుగ్గా పని చేస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు.
కరోనా టీకా అభివృద్ధిని సమీక్షించేందుకు మోదీ మొదట అహ్మదాబాద్‌లో పర్యటించారు. జైడస్ సంస్థ అభివృద్ధి చేసిన 'జైకోవ్-డి' టీకా ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్ ధరించి ప్రయోగశాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ టీకా రెండో దశ ప్రయోగాలు జరుపుకొంటోంది. అహ్మదాబాద్ నుంచి మోదీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. అనంతరం పుణె బయల్దేరి వెళ్లనున్నారు.
related stories
-
Posts ప్రపంచ శాస్త్రవేత్తలాారా ఇదే నా ఛాలెంజ్. ఎలాన్ మస్క్
-
హోమ్ DRDO-Akash Missile: లక్ష్యాలను సులువుగా ఛేదించిన ఆకాశ్.. విజయవంతమైన కొత్తతరం...
-
ఎడ్యుకేషన్ న్యూస్ / విద్య వార్తలు 'స్మార్ట్ క్యాంపస్'గా హైదరాబాద్ ట్రిపుల్ఐటీ!