Saturday, 11 Jul, 6.26 am ఈనాడు

మహబూబ్ నగర్
మొక్కలు నాటి సంరక్షించాలి : కలెక్టర్‌

గద్వాల కలెక్టరేట్‌ : హరితహారం విజయవంతం కావాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్‌ శ్రుతి ఓజా పిలుపునిచ్చారు. శుక్రవారం హరితహారంలో భాగంగా కలెక్టరేట్‌, పురపాలిక, మత్స్య, పశుసంవర్ధకశాఖ కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతో పచ్చదనంతోపాటు అటవీశాతం పెరిగి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. పట్టణమంతా పచ్చదనంతో శోభాయమానంగా కనిపించాలంటే.. ప్రజలు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకొని పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్‌ కేశవ్‌, వైస్‌ఛైర్మన్‌ బాబర్‌, కమిషనర్‌ నర్సింహ, మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్‌, పశుసంవర్ధకశాఖాధికారి ఆదిత్యకేశవసాయి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top