Wednesday, 08 Jul, 4.16 am ఈనాడు

హైదరాబాద్
మూసీ అంచున 150 అడుగుల రోడ్డు!

నాగోల్‌-అలీకేఫ్‌ వరకు ఏర్పాట్లను పరిశీలించిన నేతలు

మూసీ ఒడ్డున పర్యటిస్తున్న మంత్రి, మేయర్, ఎమ్మెల్యే, అధికారుల బృందం

ఈనాడు, హైదరాబాద్‌: నానాటికీ పెరుగుతున్న వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి అలీకేఫ్‌ వరకు రహదారిని విస్తరించనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన నాగోల్‌ మెట్రోస్టేషన్‌ సమీపం నుంచి మూసీ అంచున అంబర్‌పేట అలీకేఫ్‌ వరకు నిర్మించతలపెట్టిన ప్రత్యామ్నాయ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఇరుకు రహదారిని 150 అడుగులతో నాలుగు లైన్లుగా విస్తరిస్తామన్నారు. రోడ్డు విస్తరణతోపాటు 7.5 కిలోమీటర్ల పొడవునా మూసీ నాలాపై బాక్స్‌ డ్రెయిన్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. నాలా పక్కన పచ్చదనాన్ని పెంచేలా మొక్కలు నాటుతామన్నారు. రహదారి అందుబాటులోకి వస్తే నాగోల్‌ నుంచి అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పుతాయన్నారు.

మూసీ నది పరిసరాలను శుభ్రం చేయించామన్నారు. మూసీ సుందరీకరణ పనులు సమాంతరంగా సాగుతాయన్నారు. కార్పొరేటర్లు.. జి.సరస్వతి, స్వప్న, జ్యోత్స్న, అనలారెడ్డి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top