Thursday, 29 Oct, 8.30 pm ఈనాడు

తాజా వార్తలు
నాగబాబు రక్తదానం.. సుమ గిన్నెలు కడగాలంటే!

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు

* నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిరుతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* పాటలు పెట్టుకుని గిన్నెలు కడిగితే మజాగా ఉంటుందని అంటున్నారు వ్యాఖ్యాత సుమ. మంచి ఊపున్న పాట ఉంటే ఇంకా బాగుంటుందని ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు.

* నటి పాయల్‌ ఘోష్ ఇటీవల కేంద్ర మంత్రి అథవాలే రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఏ)లో చేరిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో తాజాగా పాయల్‌ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు.

* కీర్తి సురేశ్‌ కీలక పాత్రలో నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'మిస్‌ ఇండియా' చిత్రంలోని 'థీమ్‌ ఆఫ్‌ మిస్‌ ఇండియా' లిరికల్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu

related stories

Top