Wednesday, 27 Jan, 4.20 am ఈనాడు

తూర్పు గోదావరి
నన్నయలో ఫిల్మ్‌ కోర్సు ఏర్పాటుకు కృషి

దర్శకుడు శంకర్‌తో చర్చిస్తున్న వీసీ జగన్నాథరావు

రాజానగరం: కళలకు పుట్టినిల్లయిన గోదావరి జిల్లాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్‌ కోర్సు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలుగు చిత్ర దర్శకుడు ఎన్‌.శంకర్‌ చెప్పారు. విశ్వవిద్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి వీసీ ఆచార్య ఎం.జగన్నాథరావుతో చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో గోదావరి జిల్లావాసులకు అపారమైన అనుభవం, అవకాశాలు ఉన్నాయన్నారు. దాన్ని మరింతగా సద్వినియోగం చేసుకునేందుకు ఫిల్మ్‌ స్టడీ కోర్సును విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయదలచామన్నారు. స్థానికుల ప్రతిభను ప్రోత్సహించేలా తక్కువ ఫీజులతో ఫిల్మ్‌ స్టడీస్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ వంటి కోర్సులను ఏర్పాటు చేయవచ్చన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం, తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పెద్దల సహకారంతో ఇటువంటి కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు. గోదావరి జిల్లాలను ప్రతిబింబించే విశ్వవిద్యాలయ గీతానికి చిత్రానువాదం చేయాలని శంకర్‌ను వీసీ కోరారు. నటన, దర్శకత్వం, ఫొటోగ్రఫీ, లలిత కళలు వంటి వాటిపై శిక్షణను అందించే చక్కని వేదికగా నన్నయ వర్సిటీ ఉండబోతోందని శంకర్‌ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu

related stories

Top