Tuesday, 26 May, 10.45 pm ఈనాడు

తాజా వార్తలు
నిజమే.. అలాగంటే ఎంతో బాగుంటుంది: గిల్‌

ముంబయి: సీనియర్‌ ఆటగాళ్లు ప్రశంసిస్తే ప్రేరణ లభిస్తుందని టీమ్‌ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. జట్టుకు విరాట్‌ కోహ్లీ లాంటి నాయకుడు దొరకడం అదృష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో దేహదారుఢ్యం, బ్యాటింగ్‌ టెక్నిక్‌పై దృష్టి సారించానని వెల్లడించాడు.

కొన్నాళ్ల క్రితం రోహిత్‌శర్మకు గిల్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా అతడు 'థాంక్యూ ఫ్యూచర్‌' అని ధన్యవాదాలు తెలియజేశాడు. 'అవును, రోహిత్‌ శర్మ లాంటి వ్యక్తి అలాగంటే ఎంతో బాగుంటుంది. అయితే ఇవేమీ నన్ను ఒత్తిడిలో పడేయవు. ఎవరైనా నన్ను పొగిడినా, విమర్శించినా ఒత్తిడికి గురవ్వను' అని గిల్‌ అన్నాడు.

విరాట్‌ కోహ్లీ నాయకుడిగా ఉండటం టీమ్‌ఇండియాకు ఆశీర్వాదమని గిల్‌ పేర్కొన్నాడు. ఒత్తిడి చెందకుండా 100 శాతం రాణించేందుకు అతడు ప్రోత్సహిస్తాడని వెల్లడించాడు. 'అవును, అన్ని రకాలుగా రాణించేందుకు ఆటగాళ్లను కెప్టెన్‌ ప్రోత్సహించడం జట్టుకు ప్రయోజనకరం. అలాంటప్పుడే మన ఆటలో ఒక్క శాతమూ వృథా కాలేదని సంతృప్తి కలుగుతుంది. మైదానంలో ఉన్నప్పుడు సారథి యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తే ఎంతో బాగుంటుంది' అని గిల్‌ అన్నాడు.

'రెండు మూడు సార్లు నేను కోహ్లీతో మాట్లాడాను. ఇప్పటి వరకు చేసిందే ఇకముందూ నిలకడగా నిరంతరం చేయాలని సూచించాడు. నిలకడే అత్యంత కీలకమని వివరించాడు' అని గిల్‌ చెప్పాడు. ప్రస్తుత లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌, ఆటపై దృష్టి సారించానని అన్నాడు. ఐపీఎల్‌ను ఎంతగానో మిస్సవుతున్నానని పేర్కొన్నాడు. మళ్లీ మైదానంలో అడుగుపెట్టగానే సాధన శిబిరాల్లో కష్టపడాల్సి ఉందని వెల్లడించాడు.

కోహ్లీ×స్మిత్‌: ఎవరంటే ఏం చెబుతాం?

ఆటలో రెండో రోజు కరోనా వస్తే ఏం చేస్తారు


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>