తాజా వార్తలు
ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

రాంచీ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ డీన్ ఎల్గార్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ డికాక్(4).. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. క్రీజులో హమ్జా, డుప్లెసిస్ ఉన్నారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 497/9 వద్ద డిక్లేర్ చేసింది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
related stories
-
తాజా వార్తలు కివీస్‌పై జోరూట్ రికార్డు ద్విశతకం
-
తాజా వార్తలు టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ స్థానం తెలుసా?
-
తాజా వార్తలు విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం