Sunday, 15 Sep, 2.30 am ఈనాడు

మెదక్
పారిశుద్ధ్య లోపం... పాలనాధికారి ఆగ్రహం

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

మెదక్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య నిర్వహణ మరీ అధ్యానంగా ఉంది... నిర్వహణ ఇలా ఉంటే ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.... ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ పాలనాధికారి ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన జిల్లా కేంద్రం మెదక్‌లో ఉదయం ఆరున్నరకే వార్డులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక నవాబుపేటలో పర్యటించారు. మహబూబ్‌నహర్‌ కాలువలో చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పారబోయడంపై అసహనం వ్యక్తం చేశారు. చెత్త పేరుకుపోవడంతో దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వెంటనే శుభ్రం చేయించి ఆయిల్‌ బాల్స్‌ వేయాలని కమిషనర్‌ సమ్మయ్యను ఆదేశించారు. నవాబుపేటలో మురుగు కాలువలు నిర్వహణ తీరు దారుణంగా ఉందని, బాధ్యులైన పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ వచ్చే మున్సిపల్‌ సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. పాలనాధికారి అజంపురలోనూ పర్యటించారు. పాలనాధికారి వెంట ఏఈ సాయాగౌడ్‌, టీపీబీఓ దేవరాజ్‌ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top