Thursday, 05 Aug, 4.25 am ఈనాడు

ఖమ్మం
పాసుపుస్తకం ఇచ్చారు.. తీసుకున్నారు

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లో అనేక పొరపాట్లు, తప్పులు దొర్లటంతోపాటు కొందరు రైతుల చేతికిచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలను వెంటనే వెనక్కి తీసేసుకుంటున్నారు. వైరా మండలం గొల్లపుడి గ్రామానికి చెందిన పొన్నం వెంకటనర్సమ్మ పేరుతో సర్వే నెంబర్‌ 846లో 4.20 ఎకరాల భూమి వారసత్వంగా తన అమ్మమ్మ నుంచి సంక్రమించింది. ఆ తర్వాత ఆమె 12 గుంటలను కొనుగోలు చేసింది. మొత్తం 4.32 ఎకరాల్లో తన కుమార్తె చిట్టూరి భాగ్యమ్మకు 1.10 ఎకరాలిచ్చింది. మిగతా 3.22 ఎకరాలకు వెంకటనర్సమ్మ పేరుతో పాసుపుస్తకం రావాల్సి ఉంది. పట్టాదారు పాసుపుస్తకం మాత్రం 2 ఎకరాలకే ఇచ్చారు. మరో 1.22 ఎకరాలు భూమి కొత్త పాసుపుస్తకంలో నమోదు చేయలేదు. ఉన్నదాన్ని తీసేసుకున్నారు. కుమార్తెకు ఇచ్చిన భూమికి పాసుపుస్తకం జారీ కాలేదు. వీరి పేరుతో ఉన్న మొత్తం భూమిని గ్రామంలోని కొందరు రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటూ తమను అడ్డుకుంటున్నారని వృద్ద దంపతులు వాపోతున్నారు. ఖమ్మంలో కలెక్టర్‌ను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు వృద్ధ దంపతులు వెంకటనర్సమ్మ, పెద్ద నాగయ్యలు వచ్చారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top