ప్రకాశం
పాఠశాలకు వాటర్ ప్లాంట్ బహూకరణ

వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి తదితరులు
కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి ఎదుగుదలకు ఉపాధ్యాయులు వేసే పునాదులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. మాచవరం ఉన్నత పాఠశాలలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను వైస్ ఛైర్మన్ గంటా వెంకట సుబ్బారెడ్డితో కలిసి ప్రారంభించారు. దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించడం సంతోషకరమని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే పాఠశాలలో మరో రూ. 5 లక్షలతో మాగుంట పార్వతమ్మ షెడ్డు నిర్మాణానికి ముందుకొచ్చారన్నారు. అనంతరం కోరమండల్ వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ.. పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలు ఏర్పాటు చేసి బహుమతులు ప్రధానం చేస్తామన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఇకపై ఏడాదికి ఒక పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ శ్రీనివాసులరెడ్డి, సర్పంచి ప్రమీల, హెచ్ఎం మాల్యాద్రి, గ్రామపెద్దలు సూరం వేణుగోపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఉపాధ్యాయులు, కోరమండల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.