Thursday, 06 May, 4.20 am ఈనాడు

కరీంనగర్
పథకాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదు

రాజ్యసభసభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు


మాట్లాడుతున్న లక్ష్మీకాంతరావు

హుజురాబాద్‌ గ్రామీణం: ఉద్యమంలో కీలక నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రభుత్వ పథకాలను పలు సందర్భాల్లో కించపరిచేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం సింగాపూర్‌ గ్రామంలో ఆయన మాట్లాడుతూ తెరాసలో ఈటలకు సమున్నత స్థానాన్ని కేసీఆర్‌ కల్పించారన్నారు. ప్రజల నుంచి భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు వస్తేనే వెంటనే స్పందించి విచారణ చేపట్టారని ఆయన ప్రభుత్వ స్పందనను సమర్థించారు. ప్రభుత్వంలో.. పార్టీలో ఉండి నియోజకవర్గంలో ఇబ్బందికర పనులు ఈటల చేపట్టారని విమర్శించారు. సమీపంలోని హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు విషయంలో తిరకాసు పెట్టడం మొదలు.. సొంతపార్టీకి చెందిన హుజురాబాద్‌ ఎంపీపీపై అవిశ్వాసం పెట్టేలా పలువురిని ప్రోత్సహించిన సందర్భాలు పార్టీ వర్గాలను ఇబ్బంది కలిగించాయనే విషయాల్ని వెల్లడించారు. బాధ్యతగల హోదాలో ఉండి అసైన్డ్‌ భూమిని ఆక్రమించారనే ఆరోపణలు వచ్చిన వెంటనే మంత్రిహోదా నుంచి తప్పుకోవాల్సింది పోయి ఇంకా పదవిలో ఉంటాననేలా వ్యవహరించడం సరైనది కాదనే వాదనను ఆయన వినిపించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top