Monday, 18 Nov, 6.30 am ఈనాడు

మెదక్
పీఆర్సీ ప్రకటనకు డిమాండ్‌

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: 45 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే ప్రకటించడంతో పాటు అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రం మెదక్‌లోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీని 2018 జులై నుంచి అమలు చేయాల్సి ఉన్న ఇప్పటి వరకు ప్రకటించకపోవడం సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మారావు మాట్లాడుతూ.. గెటిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్స్‌, పండిట్‌, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన్‌, కవిత, కోశాధికారి శేఖర్‌, కార్యదర్శులు పోచయ్య, అజయ్‌, శ్రీనివాస్‌, ఫయాజ్‌, స్వామి, శ్యాంసుందర్‌, శివలింగం పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top