Friday, 02 Oct, 2.30 am ఈనాడు

మెదక్
ప్రాథమికంగా గుర్తించకనే విజృంభణ

రామాయంపేట: కరోనా వైరస్‌ బాధితులను ప్రాథమికంగా కలిసిన వారిని గుర్తించకపోవడంతోనే కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు కొవిడ్‌ జాగ్రత్తలు, మాత్రల పంపిణీ విషయమై రామాయంపేటలో అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల సమాచారం తప్పనిసరిగా సిబ్బంది వద్ద ఉండాలని తెలిపారు. ఏఎన్‌ఎం, ఆశా, అంగవాడీ ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి 19 ఏళ్లలోపు వారికి నులిపురుగుల నివారణ మందులు అందజేయాలన్నారు. 'ప్రాజెక్టు రెక్కల' పేరిట గతంలో ఏఎన్‌ఎంలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చామని, తీసుకోని వారు ఈ నెల 12లోపు దరఖాస్తు చేయాలని తెలిపారు. ఆశా కార్యకర్తలకు ఏకరూప దుస్తులు ఇచ్చారు. నిజాంపేటలో సర్పంచులతో గ్రామాల్లో పారిశుద్ధ్యంపై చర్చించారు. వైద్యురాలు ఎలిజబెత్‌, హెచ్‌ఈవో రవీందర్‌, ఫయింపాషా, పీహెచ్‌ఎన్‌ సత్తమ్మ, సూపర్‌వైజర్లు దయాకర్‌, శ్యామల, సునంద, హెచ్‌ఏ వెంకటేశ్వర్‌రావు తదితరులున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu

related stories

Top