Saturday, 20 Feb, 4.40 am ఈనాడు

విజయనగరం
ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

సంఘీభావం తెలుపుతున్న రాజకీయ, ప్రజా సంఘాల ప్రతినిధులు

మయూరి కూడలి, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ముందుకు రావాలని మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘాధ్యక్షుడు పి.షణ్ముఖరావు నేతృత్వంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అంశంపై రౌండు టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ రామకృష్ణ, ఆప్‌ జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్‌ తదితరులు హాజరయ్యారు.

పాచిపెంట: ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. మిర్తివలసలో ఆమె మాట్లాడారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top