Sunday, 12 Nov, 9.56 am ఈనాడు

తెలంగాణ బ్రేకింగ్ న్యూస్
ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు

అడవికే అందాన్నిస్తున్న జింకలుదత్తత తీసుకుంటే చక్కని ఫలితాలుప్రమాదాలను ఇట్టే పసిగట్టి చెంగున ఎగిరే జింకలు.. పురివిప్పి నర్తించే నెమళ్లు...గలగల పారే సెలయేళ్లు. పక్షుల కిలకిల రావాలు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువుగా పేరున్న చిరుతలు. ఎన్నో వన్యప్రాణులకు నిలయంగా మారిన కవ్వాల్‌ అభయారణ్యం ఇప్పుడు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు మాత్రమే పరిమితమైన చూడముచ్చటైన జంతునిలయంతో ఇక్కడి అటవీ అందాలు దేశ, విదేశీ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన అభయారణ్యం వన్యప్రాణుల సంరక్షణ, వేటగాళ్ల బారి నుంచి వాటిని రక్షించడంలో అటవీశాఖ విఫలమవుతోంది. హైదరాబాద్‌ పార్కుల్లోని జంతువులను దత్తత తీసుకుంటున్నట్లుగానే జింకల శరణాలయంలో ఉన్న మూగజీవాలను దత్తత తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ప్రకృతి ఒడిలో పెరుగుతున్న మూగజీవాలపై ప్రత్యేక కథనం...జన్నారం: మంచిర్యాల జిల్లాలో మూడు అభయారణ్యాలు ఉన్నాయి. అందులో కవ్వాల్‌ అభయారణ్యం (పులుల సంరక్షణ కేంద్రం), ప్రాణహిత కృష్ణజింకల కేంద్రం, శివ్వారం మొసళ్ల అభయారణ్యం. అటవీ సంపద, వన్యప్రాణులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి.

వీటికి తోడు దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో ముఖ్యంగా వర్షాకాలం అడవి అందాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రక్షణ కవచాలు లేకపోవడంతో రోడ్డెక్కుతున్న జీవాలు రహదారి ప్రమాదంలో అసువులు బాస్తున్నాయి.కొరవడిన వన్యప్రాణుల సంరక్షణకవ్వాల్‌ అభయారణ్యంతో పాటు కృష్ణజింకల కేంద్రం, శివ్వారం అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చేపడుతున్న చర్యలు ఫలించడం లేదు. వేటగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నగానీ, వాటిని రక్షించలేక పోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. మూగజీవాల తాగు నీటి కోసం నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, మినీ చెక్‌ డ్యాంల నిర్మాణం చేశారు.

ఐతే వేటగాళ్లు గతంలో గ్రామ పొలిమేరలోకి వచ్చే మూగజీవాలపై గురిపెట్టగా ఇప్పుడు పంట పొలాలపై పడుతున్న వాటిని హతమార్చుతున్నారు. వన్యప్రాణి సప్తాహ వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన అంతంత మాత్రంగానే కల్పిస్తుండడంతో వారోత్సవాలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. వేటగాళ్లకు కఠిన శిక్షలు అమలు చేయకపోవడంతో జైలుకు వెళ్లిన వారంతా బెయిల్‌ మీద వచ్చి యథేచ్ఛగా వేటను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వనస్థలిపురం నుంచి తీసుకు వచ్చి కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్న జింకల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.ప్రజల్లో చైతన్యం రావాలివన్యప్రాణుల సంరక్షణ కేవలం అటవీశాఖ అధికారులే కాకుండా ప్రజల్లోనూ చైతన్యం వచ్చినప్పుడే నిజమైన రక్షణ లభిస్తుంది.అటవీశాఖ ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబరును ప్రతి ఒక్కరు ఉపయోగించాలి.దత్తత ఇస్తే మంచిది..జన్నారానికి కిలోమీటరు దూరంలో మంచిర్యాల- ఆదిలాబాద్‌ ప్రధాన రహదారిని ఆనుకొని 1989లో జింకల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ప్రమాదాల బారిన పడిన జింకలు, తల్లి నుంచి విడిపోయిన చిన్న పిల్లలను ఇక్కడికి తెస్తారు. ప్రస్తుతం ఇందులో జింకలు, మెకాలు, సాంబార్లు, కొండగొర్రెలు, దుప్పులు, నీలుగాయిలు అన్నీ కలిపి 120 వరకు ఉంటాయి. దీని చుట్టూ రెండు వరుసల కంచె ఏర్పాటు చేయడమే కాకుండా ఇటీవల ఆకుపచ్చటి దుప్పట్లను కట్టారు. దీంతో మూగజీవాలకు రక్షణ ఉండడమే కాకుండా వేటగాళ్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని అటవీశాఖ అభిప్రాయపడుతోంది.

వాటి పోషణ బాధ్యత ఇద్దరు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మాత్రమే చూస్తుంటారు. అలా కాకుండా హైదరాబాద్‌లోని పార్కుల్లో ఇటీవల అటవీశాఖ అధికారులు జంతు ప్రేమికులకు మూగజీవాలను దత్తత ఇస్తున్నారు. దీంతో దత్తత తీసుకున్న జంతు ప్రేమికులే వన్యప్రాణుల పోషణ చూస్తున్నారు. అదే విధానాన్ని జన్నారంలో ఉన్న జింకల పునరావాస కేంద్రంలోని జీవాలకు అన్వయిస్తే బాగుంటుంది.కొత్త విధానం ప్రవేశపెట్టాలి- సంగర్సు రాజేశ్వర్‌రావు, జంతు ప్రేమికుడుఇక్కడా దత్తత విధానాన్ని ప్రవేశపెడితే తప్పకుండా నేనే ఒకటి, రెండు మూగజీవాలను దత్తత తీసుకొని వాటి పోషణకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తాను..

మూగజీవాలను వేటాడుట నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మనకెంతో ఆనందాన్ని పంచుతున్న వన్యప్రాణుల పట్ల ప్రతి ఒక్కరూ దయకలిగి ఉండాలి. వన్యప్రాణుల సంరక్షణ గురించి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి.ఇదీ ఒక రకమైన దత్తత- పోకల బుచ్చన్న, దినసరి వాచర్‌జింకల పునరావాస కేంద్రంలో ఉన్న మూగజీవాలన్నింటికి ఆహారం అందిస్తూ ఇరవై ఏళ్లుగా వాటి సేవలోనే ఉంటున్నాను. వేతనం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి రోజు అటవీ ప్రాంతానికి వెళ్లి వాటికి కావలసిన మేత తెస్తాం.

తాగునీరు అందించడమే కాకుండా ఉదయం పూట ప్రభుత్వం నుంచి వచ్చే దాణా వాటికి పెడతాను. ఇదీ ఒక రకమైన దత్తతగానే భావిస్తున్నాను.వేటగాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలిఅటవీ జంతువులను వేటాడుతున్న వారికి శిక్షలు కఠినంగా ఉండాలి. ఇటీవల కాలంలో కొంతమంది అదే పనిగా వేటను కొనసాగిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు పంటల చుట్టూ అమర్చుతున్న విద్యుత్తు తీగలకు అడవి పందులే కాకుండా జింకలు, దుప్పులు సైతం తగిలి మృత్యువాత పడుతున్నాయి.

అభయారణ్యంలో సంచరిస్తున్న ఆంటీపోచింగ్‌ వాచర్లు సైతం నిఘాను పెంచారు. అటవీఅధికారుల కళ్లుగప్పి వేటాడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మూగజీవాలంటే నాకు ప్రాణం- గొట్ల లింగన్న, దినసరి వాచర్‌ఇంటి పనులన్నీ వదులుకొని మూగజీవాలకు ఆహారం అందించడంతోనే రోజు గడిచిపోతుంది. అవంటే నాకు ప్రాణం. సొంత పనులను వదులుకొని వాటి పోషణలోనే ఏళ్లు గడిచిపోయాయి.

కానీ పనికి తగిన ప్రతిఫలం అందడం లేదు. ఒక్కరోజు కూడ ఎటు వెళ్లడానికి వీలు కాదు. ఒకవేళ ఎటైన వెళితే జింకల పార్కులో ఉన్న మూగజీవాలకు ఆహారం అందడం కష్టమే. ఎంతో సేవ చేస్తున్నప్పటికిని అధికారులు గుర్తించకపోవడం బాధాకరం.

ఇక్కడి మూగజీవాలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top