తెలంగాణ బ్రేకింగ్ న్యూస్
ప్రపంచ దేశాలకు ఆదర్శం భారత్ బయోటెక్

స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా
ఈనాడు హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నగరంలోని భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకా తయారు చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తన సతీమణి పుష్పతో కలిసి హైదరాబాద్ నిమ్స్‌లో బుధవారం ఆయన టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే అందరికీ టీకా అందుబాటులోకి వస్తుందని, తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దంపతులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు టీకా తీసుకున్నారు. ''మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా చూద్దాం'' అని గుత్తా పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా టీకా తీసుకోవాలని కోరారు.
related stories
-
తెలంగాణ తాజావార్తలు బీజేపీకి దేశంలో ఎన్నికలు తప్ప .. కరోనా ఇబ్బందులు పట్టవా: వీహెచ్
-
తెలంగాణ తాజావార్తలు కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
-
హైదరాబాద్ సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ మృతిపట్ల దాసోజు సంతాపం