Wednesday, 05 Aug, 4.32 pm ఈనాడు

తాజా వార్తలు
రామ మందిరంపై రాజకీయ నేతల స్పందన

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నేడు వైభవంగా జరిగింది. వేద పండితుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, భూమిపూజ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు తమ స్పందనలను సోషల్‌మీడియా ద్వారా తెలియజేశారు.

అమిత్‌ షా - కరోనా వైరస్‌ సోకటంతో కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయిన హోం మంత్రి అమిత్‌ షా, ఓ చక్కని రామమందిర చిత్రాన్ని ట్వీట్ చేశారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌- రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తులసీ దాస్‌ రచించిన 'రామ్‌ చరిత మానస్' నుంచి కొన్ని పంక్తులతో పాటు రామ మందిరానికి సంబంధించిన కొన్న చిత్రాలను ట్వీట్‌ చేశారు.

నిర్మలా సీతారామన్‌- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, తమ ఇంటి ముందు ''చాలా మంది తమ ఇంటి ముందు బియ్యపు పిండితో ఓ కొత్త రోజుకు ఆరంభ సూచనగా ముగ్గు వేస్తారు. ఇక ఇప్పుడు ఈ రోజు మా ఇంట్లో చిన్న మందిరంలో ఇదే...'' అంటూ జై శ్రీరామ్‌ అని ఉన్న ముగ్గు చిత్రాన్ని ట్వీట్‌ చేశారు.

స్మృతి ఇరానీ- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ చిన్నారి ఆలపించిన శ్రీరాముడి భక్తిగీతానికి, జైశ్రీరాం అనే వ్యాఖ్యను జతచేస్తూ ట్వీట్‌ చేశారు.

యోగి ఆదిత్య నాథ్‌- ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రామాయణ మహాకావ్యం నుంచి కొన్ని శ్లోకాలను తన ట్విటర్‌ ఖాతాలో ఉటంకించారు. జై శ్రీరామ్‌ అని భక్తులను అభినందించారు. అంతేకాకుండా ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో దీపాలను వెలిగించి, బాణసంచాను కాల్చడం ద్వారా తన సంతోషాన్ని ప్రకటించారు.

దేవేంద్ర ఫడణవిస్‌- ''భగవాన్‌ శ్రీరాముడి మందిరం వేలాది రామభక్తుల నమ్మకానికి ప్రతీక..'' అంటూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

న్యాయశాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌- ''భారత రాజ్యాంగం అసలు ప్రతిలో రావణుని ఓడించిన అనంతరం శ్రీరాముడు, సీత, లక్షణులు అయోధ్యకు తిరిగి వస్తున్న చిత్రం ఉంది. ఇది ప్రాధమిక హక్కులకు సంబంధించిన అధ్యాయం ప్రారంభంలో కనిపిస్తుంది.'' అంటూ ఆ చిత్రాన్ని కూడా ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్- ''శ్రీరాముడు అందరికీ న్యాయం, సత్ప్రవర్తన, అన్ని వ్యవహారాల్లో ధర్మంగా, ధృఢంగా వ్యవహరించే సామర్థ్యం, నైతికత, ధైర్యాలను ప్రసాదించాలి. ఈ విలువలు ఈ క్లిష్ట పరిస్థితుల్లో చాలా అవసరం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top