తాజా వార్తలు
రెడ్మీ తొలి గేమింగ్ ఫోన్..ఎప్పుడంటే..!

ఇంటర్నెట్ డెస్క్: షావోమి అనుబంధ సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించి బడ్జెట్ శ్రేణి మొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది రెడ్మీ. తక్కువ ధర..ఎక్కువ ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ని విడుదల చేస్తూ వినియోగదారులకు చేరువైంది. ఇప్పటి వరకు సాధారణ శ్రేణి ఫోన్లను తీసుకొచ్చిన రెడ్మీ త్వరలో పూర్తిస్థాయి గేమింగ్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్లో ఇటీవల విడుదల చేసిన డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు. అలానే ఎల్సీడీ లేదా అమోలెడ్ డిస్ప్లే ఇస్తారని తెలుస్తోంది. గేమింగ్ ఫోన్ కాబట్టి పెద్ద బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉంటాయని టెక్ వర్గాల అంచనా.
రెడ్మీ తొలి గేమింగ్ ఫోన్ గురించి ఆ సంస్థ జనరల్ మేనేజర్ లు విబింగ్ చైనా సామాజిక మాధ్యమం విబోలో ఒక పోస్ట్ చేశారు. '' 2021లో రెడ్మీ తన తొలి ఫ్లాగ్షిప్ గేమింగ్ ఫోన్ విడుదల చేయనుంది. ఈ-స్పోర్ట్స్ గేమింగ్ అనుభూతిని మొబైల్ యూజర్స్ అందివ్వాలనే లక్ష్యంతో సంస్థ ఈ ఫోన్‌ను తీసుకొస్తుంది'' అని తెలిపారు. గేమింగ్ ఫోన్‌తో పాటు త్వరలో మార్కెట్లోకి రానున్న రెడ్మీ కే40 సిరీస్ కొత్త ఫోన్లో కూడా డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు లు విబింగ్ తెలిపారు.
రెడ్‌మీతో పాటు రియల్మీ కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో కొత్త ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రియల్మీ ఎక్స్9 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ 12జీబీ ర్యామ్/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యూఐ 2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనక వైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, రెండు 13 ఎంపీ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. 6.4-అంగుళాల ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారట. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుందట. అయితే ఈ ఫోన్లను ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు.