Tuesday, 19 Nov, 6.30 am ఈనాడు

మెదక్
రెండేళ్ల కౌలు ఇప్పించాలని వినతి

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: మాకు తెలియకుండా మా తల్లికి చెందిన పొలాన్ని గ్రామానికి చెందిన వారు రెండేళ్లుగా సాగు చేసుకుంటూ కౌలు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని హవేలి ఘనపూర్‌కు చెందిన బంజ వీరప్ప అదనపు ఎస్పీ నాగరాజు వద్ద మొర పెట్టుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించగా ఆయన వినతులు స్వీకరించారు. తన తల్లి పొలాన్ని రెండేళ్లుగా పంట వీరప్ప, ఆయన సంబంధీకులు సాగు చేసుకుంటూ ఒక్క రూపాయి కూడా కౌలు ఇవ్వలేదని, అడిగితే గొడవకు దిగి చంపుతామని బెదిరిస్తున్నారని బంజ వీరప్ప వాపోయారు. చర్యలు తీసుకోవాలని మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌కు అదనపు ఎస్పీ సూచించారు.

* తన కుమారుడి నుంచి విడాకులు తీసుకున్న కోడలు ఆస్తిలో వాటా ఇవ్వాలని గొడవకు దిగుతోందని సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన పోతరాజు సత్యానంద్‌ వాపోయారు. ఈ విషయంలో తగిన న్యాయం చేయాలంటూ తూప్రాన్‌ సీఐ స్వామికి అదనపు ఎస్పీ చరవాణిలో సూచించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top