తాజా వార్తలు
రేపు పార్లమెంటుకు ఆర్థిక సర్వే

ఇంటర్నెట్డెస్క్: రేపు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే రానుంది. బడ్జెట్ కంటే కొన్ని రోజుల ముందే దీనిని ప్రవేశపెట్టడం విశేషం. దీనిని ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ పరిధిలో ఎకనామిక్ డివిజన్ దీనిని సిద్ధం చేసింది. రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రేపు ప్రసంగించనున్నారు. అఖిలపక్ష భేటీ కూడా ఆర్థిక సర్వే తర్వాత 30వ తేదీన జరగనుంది. ఈ సారి ఆర్థికసర్వేలో దేశం ఎదుర్కోబోయే కీలకమైన సవాళ్లను కూడా ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అంశాలను చూస్తున్న దృష్టికోణం ఈ ఆర్థిక సర్వేలో బయటపడుతుంది. దీంతోపాటు దేశంలోని పరిస్థితులను వివరిస్తుంది. కాకపోతే ఈ సర్వే సలహాలను కచ్చితంగా ప్రభుత్వం పాటించాలనే నిబంధన ఏమీ లేదు. అంతేకాదు.. వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని కూడా ఈ పత్రంలో విశ్లేషిస్తారు. ఇక మౌలిక వసతులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యోగిత, ధరలు, ఎగుమతులు, ఇంపోర్ట్స్, బడ్జెట్ను ప్రభావితం చేసే ఇతర అంశాలు ఉంటాయి.
కొవిడ్ వంటి క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.7శాతం తగ్గిపోతుందని తొలుత అంచనా వేశారు. మరి ఈ ఆర్థిక సర్వేలో ఏమి చెబుతారో చూడాలి. అంతేకాదు.. భారత్ 2019 నిర్దేశించిన 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే అవసరమైన ప్రణాళిక అంశాలను కూడా ప్రస్తావించ వచ్చు.
ఇవీ చదవండి
బడ్జెట్లో ఆదాయపు పన్ను రాయితీలు..!
related stories
-
హోమ్ సంక్షోభ నివారణలో సమర్థులు అవని తనయలు
-
తెలంగాణ తాజావార్తలు అన్ని వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయం : మంత్రి
-
తెలంగాణ తాజావార్తలు అదుపు తప్పిన పెళ్లి వివాహం