Friday, 30 Oct, 1.50 am ఈనాడు

కర్ణాటక
రౌడీషీటర్‌..

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: దారి దోపిడీకి పథకం రూపొందించుకుని మారణాయుధాలతో పొంచి ఉన్న చంద్ర అలియాస్‌ కరియా అనే రౌడీషీటరు, అతని ఐదుగురు అనుచరులను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను హుచ్చేగౌడ, యోగేశ్, రాకేశ్, అరుణ్‌ కుమార్, మంజునాథ్‌గా గుర్తించారు. వీరి నుంచి మారణాయుధాలు, వాహనాలను, చరవాణులను స్వాధీనపరచుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను విజయనగర పోలీసులకు అప్పగించామని జాయింటు పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు.
* నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటరు కార్తిక్‌ అలియాస్‌ పెప్పర్, అతని ముగ్గురు అనుచరులు హేమంత్‌ కుమార్, శివస్వామి, ప్రభాత్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరిపై జ్ఞానభారతి, బ్యాడరహళ్లి, శివమొగ్గ, హాసన, రామనగర జిల్లాలోని వివిధ ఠాణాల్లో కేసులు ఉన్నాయి. కేసు దర్యాప్తు బాధ్యతలను బ్యాడరహళ్లి పోలీసులకు అప్పగించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top