Monday, 10 Aug, 3.26 am ఈనాడు

మహబూబ్ నగర్
సెప్టెంబరు 10లోగా పనులు పూర్తి చేయాలి

వీరాపురం(గద్వాల న్యూటౌన్‌) : జిల్లాలోని అన్ని గ్రామాల్లో సెప్టెంబరు 10 వరకు సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. ఆదివారం గద్వాల మండలం వీరాపురంలో నిర్మాణంలో ఉన్న సెగ్రిగేషన్‌ షెడ్‌, పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెగ్రిగేషన్‌ షెడ్డు ద్వారా తడి, పొడి చెత్తను వేరుచేసి ఎరువుగా మార్చడం జరుగుతుందన్నారు. పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలకు నీరుపోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగష్టు 15లోగా అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు పూర్తి చేయాలన్నారు. డీఆర్‌డీవో ఉమాదేవి, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌, ఎంపీడీవో నాగశేషాద్రి సూరి, ఎంపీవో చెన్నయ్య, ఏపీవో శివజ్యోతి, నాయకులు వెంకట్రాములు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top