Tuesday, 11 Aug, 2.05 am ఈనాడు

తాజా వార్తలు
షా, సిడ్బిల ఆధ్వర్యంలో 700 కుట్టు మిషన్‌ పాఠశాలలు

దిల్లీ: మూడు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉషా ఇంటర్నేషనల్‌, సిడ్బిలు కలిసి 700 ఉషా సిలాయ్‌ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నాయి. 'మిషన్‌ స్వావలంబన్‌'లోని రెండో దశ కింద హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. మొదటి దశలో తెలంగాణ, బిహార్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో 1000 పాఠశాలలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గ్రామీణ మహిళలకు కుట్టు పనిలో నైపుణ్యం ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక సాధికారత ఇవ్వడమే దీని ఉద్దేశం. 'కొన్ని ఎంపిక చేసిన జిల్లాలు, విపత్తు ప్రభావ ప్రాంతాల్లో తాజాగా 700 కొత్త సిలాయ్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉషా ఇంటర్నేషనల్‌ సీఈఓ దినేశ్‌ చాబ్రా పేర్కొన్నారు. 'రెండో దశలో టైలరింగ్‌ నైపుణ్యంతో పాటు.. జీవన నైపుణ్యాలు, ఔత్సాహిక పారిశ్రామిక పనితనాన్ని కూడా నేర్పించనున్న'ట్లు సిడ్బి సీఎండీ మహమ్మద్‌ ముస్తఫా తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top