Wednesday, 05 Aug, 3.35 am ఈనాడు

విశాఖ
షిప్‌యార్డు సందర్శన

సింధియా(విశాఖపట్నం) న్యూస్‌టుడే : హిందుస్థాన్‌ షిప్‌యార్డును మంగళవారం సెంట్రల్‌ చీఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌రెడ్డి సందర్శించారు. ఇటీవల షిప్‌యార్డులో చోటుచేసుకున్న భారీ క్రేన్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో ఆయన సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఈ నెల 3న నిపుణుల కమిటీ బృందం సందర్శించి వివరాలను సేకరించింది. నిపుణుల కమిటీ, యాజమాన్యం చేపడుతున్న అంతర్గత విచారణ కమిటీ నివేదికల ఆధారంగానే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కార్మికవర్గాలు భావిస్తున్నాయి. కూలిన క్రేన్‌ను పూర్తిగా అక్కడి నుంచి తొలగించే పనులకు కూడా ఒకింత బ్రేక్‌ పడినట్టే. విచారణ సంఘాల నివేదిక వచ్చేంత వరకు శకలాలను తొలగించేందుకు ఆస్కారం ఉండబోదని పేర్కొంటున్నారు. అలాగే కూలిన క్రేన్‌ శకలాలను తొలగించాలంటే తిరిగి మరో సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తంఅవుతోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top