తాజా వార్తలు
సిద్ధూతో నాకు సంబంధం లేదు: సన్నీ

చండీగఢ్: గణతంత్ర దినోత్సవం వేళ రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్తంగా మారిన వేళ పంజాబ్‌కు చెందిన సినీ నటుడు దీప్ సిద్ధూ పేరు తెరపైకి వచ్చింది. ఎర్రకోట ముట్టడికి ఆయనే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్నీ దేవోల్ పేరు ప్రచారంలోకి వచ్చింది. భాజపా ఎంపీ అయిన దేవోల్‌కు, దీప్ సిద్ధూకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దేవోల్ స్పందించారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ దీప్ సిద్ధూతో ఎలాంటి సంబంధాలూ లేవని ట్వీట్ చేశారు. గతంలోనూ ఇదే విషయం చెప్పానని తెలిపారు. ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఉద్రిక్తతల పట్ల విచారం వ్యక్తంచేశారు.
సన్నీ దేవోల్ 2019 ఎన్నికల్లో గుర్దాస్పూర్ నుంచి పోటీ చేసి గెలిపించారు. ఆ ఎన్నికల సమయంలో దేవోల్‌కు మద్దతుగా సిద్ధూ ప్రచారం చేశారు. అయితే, రైతుల ఉద్యమంలో సిద్ధూ పాల్గొంటున్నప్పటి నుంచి దేవోల్ అతడికి దూరంగా ఉంటున్నారు. తాజాగా రైతులు ఎర్రకోట ముట్టడించిన ఉంచిన వేళ ప్రధాని మోదీ, సన్నీదేవోల్, దీప్ సిద్ధూ కలిసి ఉన్న చిత్రాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో దేవోల్ వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి..
దిల్లీ అల్లర్లు.. 'దీప్ సిద్ధూ' పాత్రేంటీ?
ఎర్రకోట ఘటనపై హోంశాఖ సీరియస్!
related stories
-
జాతీయం-అంతర్జాతీయం క్షమాపణ చెప్పేవరకూ మంత్రికి క్లాసు పీకిన సీఎం... కారణమిదే!
-
ప్రధాన వార్తలు నన్ను బెదిరించలేరు, కొనలేరు
-
ప్రధాన వార్తలు టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే చానల్‌పై పరువు నష్టం దావా