సినీ నటుడు సిద్ధప్పనాయుడు కన్నుమూత

Monday, 09 Oct, 4.19 am

22 చిత్రాల్లో నటన, పలు నాటకాల్లో ప్రదర్శన
మదనపల్లె (నేరవార్తలు), న్యూస్‌టుడే : పలు సినిమాల్లో నటించిన సిద్ధప్పనాయుడు ఆదివారం సాయంత్రం ఆయన నివాసంలోనే కన్నుమూశారు. మదనపల్లె పట్టణం బండమీదకమ్మపల్లెకు చెందిన జోలేపాళెం సుబ్బయ్యనాయుడు, లక్ష్మమ్మ దంపతులకు సిద్ధప్పనాయుడు 1923 సంవత్సరం డిసెంబరు 7వ తేదీన జన్మించారు. బీఏ పూర్తి చేసిన ఆయన 1945లో ఉద్యోగంలో చేరి రెవెన్యూశాఖ, ఆహారశాఖల్లో గుమాస్తాగా పనిచేశారు. 1978 సంవత్సరంలో సచివాలయంలో సహాయ కార్యదర్శిగా పని చేశారు. కత్తిసాము, కర్రసాము నేర్చుకున్నారు.1942 సంవత్సరంలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో, విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు.