Friday, 24 Sep, 10.35 am ఈనాడు

తాజా వార్తలు
Stock market : బీఎస్‌ఈ చరిత్రలో మరో అద్భుత ఘట్టం!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం సెన్సెక్స్‌ ఆరంభంలోనే 60,000 పాయింట్ల మరుపురాని మైలురాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ బుల్‌ రంకెకు కారణమవుతున్నాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 375 పాయింట్ల లాభంతో 60,260 వద్ద.. నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 17,933 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.78 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top