Friday, 24 Sep, 5.41 am ఈనాడు

Breaking AP
సుబ్బారెడ్డి లైంగిక వేధింపులు వాస్తవమే

మహిళా కమిషన్‌ నివేదికతో విధుల నుంచి తొలగింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉద్యోగినులపై ఎస్సెస్సీ బోర్డు ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ సుబ్బారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడటం వాస్తవమేనని రాష్ట్ర మహిళా కమిషన్‌ పేర్కొంది. తమ విచారణలో ఈ మేరకు వెల్లడైనట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 'ఎస్సెస్సీ బోర్డు ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ సుబ్బారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కొందరు ఉద్యోగినులు మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. మేం విచారణ చేయగా సుబ్బారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడటం వాస్తవమేనని తేలింది. దీంతో అతన్ని పదవి నుంచి తొలగించి శాఖ పరమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖకు నివేదించాం' అని కమిషన్‌ వెల్లడించింది.

ఈ సందర్భంగా మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఉద్యోగినులకు కమిషన్‌ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కమిషన్‌ నివేదికతో సుబ్బారెడ్డిని విధుల్లో నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో ఆదర్శ పాఠశాలల సంయుక్త సంచాలకుడు రవీంద్రనాథ్‌రెడ్డికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది. సుబ్బారెడ్డిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించడం హర్షణీయమని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుబ్బారెడ్డి అక్రమంగా చేసిన సస్పెన్షన్లను, ఉద్యోగులకు ఆయన ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu

related stories

Top