Monday, 23 Sep, 11.55 am ఈనాడు

ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్
తల్లి నలుగురు కూతుళ్ల ఆత్మహత్య..?

మాలేగావ్‌: దేశం మొత్తం ఆదివారం కూతుళ్ల దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు తమ కుమార్తెలతో ఉన్న తీపి జ్ఞాపకాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంటే మహరాష్ట్రలోని మాలేగావ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక తల్లి తన నలుగురి కూతుళ్లతో కలిసి బావిలో శవాలుగా తేలారు. మాలేగావ్‌లోని బుల్దాన్‌ ప్రాంతంలో ఈ విషాదకర సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా.? లేక ఎవరైనా చంపి బావిలో పడేశారన్న విషయం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావి నుంచి మృతదేహలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top