Sunday, 26 Aug, 12.40 pm ఈనాడు

తాజా వార్తలు
తెలంగాణ జన సమితిలో పలువురి చేరిక

తెలంగాణ జన సమితిలో పలువురి చేరిక హైదరాబాద్‌: యువత సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనుమడు మర్రి ఆదిత్య, పారిశ్రామిక వేత్త బాల లింగం ఆదివారం తెజసలో చేరారు. పార్టీ అధ్యక్షుడు కోదండరాం.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుత రాజకీయాల్లో యువ నాయకుల అవసరం ఎంతైనా ఉందని కోదండరాం అన్నారు. వచ్చే నెల 2న తెరాస నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు నియమ, నిబంధనల ప్రకారమే అనుమతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని... అధికార దుర్వినియోగం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్టం వచ్చినా.. గ్రామాల్లో సమస్యలు ఇంకా అలానే ఉన్నాయని మర్రి ఆదిత్య రెడ్డి అన్నారు. చిన్నప్పటి నుంచే తాతయ్యను, నాన్నను సమస్యలపై ప్రశ్నించేవాడినని గుర్తుచేశారు.

కోదంరాం తనకు ప్రేరణ అని.. ఆయన పోరాటం నచ్చే తెజసలో చేరినట్లు స్పష్టం చేశారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top