Thursday, 05 Aug, 4.15 am ఈనాడు

హైదరాబాద్
టీసీఈఐ-టెఫా ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ పోటీ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ(టీసీఈఐ) ఆధ్వర్యంలో టీసీఈఐ-టెఫా(తెలంగాణ ఈవెంట్‌ ఫెసిలిటేటర్స్‌ అసోసియేషన్‌) వారు ప్రపంచ ఛాయా చిత్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు రాఖీ కంఖారియా పేర్కొన్నారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు 'భావోద్వేగాలు'(ఎమోషన్స్‌) అనే అంశంపై ఛాయా చిత్రాలను ఈ నెల 5వ తేదీలోగా పంపించాలని సూచించారు. అంతర్జాలం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 98490 03482 / 90103 93628/ 99895 23143 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top