Thursday, 04 Mar, 4.16 am ఈనాడు

మార్కెట్‌
తొలి 10 చక్రాల ట్రక్‌: టాటా

దిల్లీ: దేశంలోనే తొలిసారిగా మూడు ఇరుసుల (10 చక్రాలు) ట్రక్కును టాటా మోటార్స్‌ ఆవిష్కరించింది. 'సిగ్నా 3118.టి'గా పిలిచే ఈ ట్రక్కు స్థూల బరువు(జీవీడబ్ల్యూ) 31 టన్నులు. 28 టన్నుల జీవీడబ్ల్యూ ట్రక్కుతో పోలిస్తే 3500 కిలోల అధిక పేలోడ్‌ సామర్థ్యం కలిగిన ఈ ట్రక్కు ధర, ఇంధన, నిర్వహణ వ్యయాలు మాత్రం ఆ వాహనంతో సమానంగానే ఉండడం విశేషం. 28 టన్నుల ట్రక్కుతో పోలిస్తే 45 శాతం మేర నికర నిర్వహణ లాభాన్ని అధికంగా పొందేలా చేయడం కోసమే దీనిని తీసుకొచ్చినట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. పెట్రోలియం, ఆయిల్‌- లూబ్రికెంట్లు, రసాయనాలు, తారు, వంటనూనెలు, పాలు, నీళ్లతో పాటు ఎల్‌పీజీ సిలిండర్లు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు వినియోగించుకోవచ్చని వివరించింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top